Home  »  TV News  »  "గెటౌట్ ఆఫ్ మై స్టూడియో" అంటూ కిషోర్ పై అరిచిన గెటప్ శీను

Updated : Jul 1, 2022

అశోకవనంలో అర్జునకల్యాణం మూవీ టైంలో ఒక టీవీ న్యూస్ ఛానల్ లో యాంకర్ దేవికి, విశ్వక్ సేన్ కి మధ్య ఎంత పెద్ద వార్ జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ మూవీకి సంబంధించి చేసిన  ప్రాంక్ వీడియో విషయంపై ఆ న్యూస్ ఛానల్ లో  హాట్ హాట్ గా జరిగిన డిబేట్ మాత్రం టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. తర్వాత ఈ టాపిక్ మీద జబర్దస్త్ స్కిట్స్ కూడా మస్త్ పేలాయి. ఐతే తాజాగా గెటప్ శీను ఈ కాంట్రవర్సీ టాపిక్ మీద ఒక వీడియో చేసి వార్తల్లో నిలిచాడు. హ్యాపీ బర్త్డే అనే మూవీ జులై 8 న రిలీజ్ అవుతున్న సందర్భంలో ఇందులో నటించిన వారితో ఒక స్కిట్ చేసాడు. న్యూసెన్స్ అనే టీవీ లోగో పెట్టి అందులో న్యూస్ రీడర్ గా గెటప్ శీను దేవి నాగవల్లి అవతారమెత్తుతాడు. ఇక ఈ మూవీలో నటించిన కమెడియన్ అని చెప్పుకు తిరుగుతున్న సత్య గారు మన స్టూడియోలో ఉన్నారు అంటాడు శీను. చెప్పు కాదండి షూ వేసుకొచ్చానని సత్య కామెడీ చేస్తాడు. వెంటనే పక్కనే వున్న వాటర్ బాటిల్ సత్య మీదకు విసిరేసి ఇలాంటి డైలాగులు బయటవేసుకోండి లేదా మీ సినిమాలో పెట్టుకోండి అంటూ సీరియస్ అవుతాడు. 

ఇక  మూవీ హీరో నరేష్ అగస్త్య స్టూడియోకి వస్తారు. ఫైనల్ గా లైవ్ లో వెన్నెల కిషోర్ జాయిన్ అవుతారు. ఇక ఈ ముగ్గురు ఎన్ని సినిమాలు తీశారు. ఎన్ని ఆడాయి అంటూ పోట్లాడుకుంటూ ఉంటారు. ఇంతకు ఈ మూవీలో హీరో ఎవరు అంటూ అరుచుకుంటూ ఉంటారు.    ఏంటయ్యా ఈ చెత్త డిబేట్లు అంటూ ఫైర్ అవుతాడు వెన్నెల కిషోర్. అరె పిల్ల బచ్చాస్ ఏ ఈవెంట్ లో ఐనా హీరో లాస్ట్ లో మాట్లాడతాడు అంటాడు. ఇక ఈ షోలో బినామీ క్యారెక్టర్ చేసిన ఒక వ్యక్తి స్టూడియోలోకి వచ్చేసి సత్యతో హడావిడి చేస్తూ ఉంటాడు. గెటప్ శీను అతన్ని చూసి చాలా ఇరిటేట్ అవుతాడు. ఏం చేయాలో అర్థంకాక  టైం స్లాట్ ఐపోయింది నెక్స్ట్ డిబేట్ లో చూద్దాం అంటాడు. అక్కడి గొడవ చూసి వెన్నెల కిషోర్ బుల్ షిట్ అంటాడు. వెంటనే గెటప్ శీను సీరియస్ ఐపోయి గెట్ అవుట్ అంటూ అరుస్తాడు. 

వెంటనే కిషోర్ బయట చల్లగా ఉందండి అంటూ కామెడీ చేసేసరికి గెటౌట్ ఆఫ్ మై స్టూడియో అంటూ పిచ్చి పట్టినట్టు అరుస్తాడు శీను. నేను స్టూడియోలో లేనండి బాబు క్యారవాన్ లో ఉన్నాను అంటాడు కిషోర్. ఐనాసరే గెటౌట్ అంటాడు శీను. మీలో ఎవరు హీరో అనే స్కిట్ చివరికి గొడవగొడవగా మారి శీను స్టూడియోలోంచి లేచి  వెళ్ళిపోతాడు మరో డిబేట్ లో కలుద్దామంటూ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.